![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -143 లో.. నువ్వు సీతాకాంత్ భార్యవి అని మురిసిపోతున్నావ్ కానీ నిన్ను మనస్ఫూర్తిగా సీతా పెళ్లి చేసుకున్నాడా.. కనీసం మీ పెళ్లి విషయం నలుగురికి అయిన తెలుసా.. నా భార్య అని ఎవరికి అయినా పరిచయం చేశాడా అని రామలక్ష్మితో శ్రీలత అంటుంది. ఇప్పుడేంటి సీతాకాంత్ సర్ భార్యని కాదు.. నేను ఎవరికి తెలియదన్న భ్రమలోనే ఉన్నావా.. సరే నీ భ్రమ నేను పోగొడతాను కదా అని రామలక్ష్మి అంటుంది.
అమ్మ ప్రేమ అనే బ్రహ్మస్త్రం.. నా దగ్గర ఉన్నంత కాలం నువ్వు నన్ను ఏం చెయ్యలేవని శ్రీలత అంటుంది. అలా ఇద్దరు ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటారు. ఆ తర్వాత రామలక్ష్మి ఒంటరిగా ఆలోచిస్తుంటే.. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. నాకు తెలుసు రామలక్ష్మి అందరు నిన్ను దొంగ అంటుంటే నువ్వు ఎంత బాధపడ్డావో కానీ నేనేం మాట్లాడలేని సిచువేషన్ లో ఉన్నానని సీతాకాంత్ అంటాడు. అప్పుడే సిరి, పెద్దాయన వస్తారు. అవును వదిన నువ్వేం అనుకుంటున్నావోనని అన్నయ్య చాలా బాధపడ్డాడని సిరి అంటుంది. నువ్వు ఒంటరిగా వెళ్తే ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందని నన్ను సీతా వెనకాలే పంపించాడని పెద్దాయన రామలక్ష్మికి చెప్తాడు. సీతాకాంత్ రామలక్ష్మికి సారీ చెప్తాడు. అయిన రామలక్ష్మి మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నువ్వేం బాధపడకురా తనే నిన్ను అర్థం చేసుకుంటుందని సీతకాంత్ తో పెద్దాయన అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ కి రామలక్ష్మి పాలు తీసుకొని వచ్చి ఇస్తుంది. చేతికి ఇవ్వకుండా టేబుల్ పై పెట్టి వెళ్తుంది. నాకు చేతికి ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదంటే తనకి నాపై ఎంత కోపం ఉందని సీతాకాంత్ అనుకుంటాడు. మళ్ళీ రామలక్ష్మి వచ్చి పాలు తీసుకొని సీతకాంత్ కి ఇస్తుంది. వద్దని అనగానే.. మీరు రోజు పాలు తాగి పడుకుంటారు కదా అని రామలక్ష్మి అనగానే.. నీ కంటే బాగా నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు రామలక్ష్మి.. ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నానో చెప్పాను కదా నీ కంటే ఎక్కవ నేనే బాధ పడ్డానని సీతాకాంత్ అంటాడు. నేను మీతో మాట్లాడను.. అలిగానని రామలక్ష్మి అంటుంది. అలక మనాలంటే ఏం చెయ్యాలని సీతాకాంత్ అంటాడు. నాకు ఐస్ క్రీమ్ కావాలని రామలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత రామలక్ష్మి ని సీతాకాంత్ తీసుకొని బయటకు వెళ్తాడు. ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. రామలక్ష్మి ఐస్ క్రీమ్ కింద పడిపోతే సీతకాంత్ ఐస్ క్రీమ్ తీసుకొని రామలక్ష్మి తింటుంది. మరొకవైపు సందీప్ ఇంట్లో నుండి వెళ్లి పోకుండా ఉండాలంటే ఇలా చెయ్యాలంటూ సందీప్ , శ్రీవల్లిలకి శ్రీలత ఒక ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |